ఒక సమర్థవంతమైన నిరోధిని: మిగిలిన ప్రముఖమైన నిరోధినుల కంటే తక్కువ RAM మరియు తక్కువ CPUని ఉపయోగిస్తూ వేలాది వడపోత జబీతాలను అమలు చేయగలిగే ఉత్తమమైన నిరోధిని.
వాడుక: ప్రస్తుతం వీక్షిస్తున్న వెబ్ సైట్లో uBlock₀ని క్రియాశీల పరచడానికి లేదా అచేతనపరచడానికి, popupలో వున్న పెద్ద బటన్ని ఉపయోగించండి. ఈ బటన్ కేవలం ప్రస్తుత వెబ్ సైట్ కి మాత్రమే వర్తిస్తుంది, బ్రౌజరు మొత్తానికి ఇది బటన్ కాదు.
కాకపోతే సాధారణంగా ఎన్ని ఎక్కువ వడపోత జాబితాలను ఉపయోగిస్తే అంత ఎక్కువగా RAM ఉపయోగించబడుతుంది. uBlock, ఫ్యాన్ బాయ్ యొక్క అదనపు రెండు జాబితాలు ఇంకా hpHosts వారి ప్రకటనా సేవికలు ఉపయోగించినాకుడా మిగతా ప్రముఖమైన నిరోధకాల కంటే తక్కువ RAMని వాడుతుంది.
కానీ, పైవాటిలోని కొన్ని అదనపు జాబితాలను ఎక్కించిన యెడల వెబ్ సైట్ పనితనంపైన అవాంచిత ప్రభావం పడే ఆస్కారం ఉంది, ప్రత్యేకించి hosts ఫైల్గా ఉపయోగించబడే జాబితాలులతో అది జరిగే ఆస్కారం ఎక్కువ.
నిర్దేశిత జాబితాలు లేకపోతే, ఈ పొడిగింపు నిష్ప్రయోగాజనకం. అందువలన, ఏ సమయంలోనైనా మీరు ఏదైనా విరాళం చేయదలిచితే, మీరు ఉపయోగించే ఆ జాబితాలను కష్టపడి రచించి, నిర్వహించి మరియు ఉచితంగా అందరికి విడుదలచేసే వారి గురించి ప్రప్రధమంగా ఆలోచించండి.